మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 08:18:04

రష్యాలో మరణించిన విద్యార్థుల మృతదేహాలు తెప్పించాలి : సీఎం పళనిస్వామి

రష్యాలో మరణించిన విద్యార్థుల మృతదేహాలు తెప్పించాలి : సీఎం పళనిస్వామి

చెన్నై: రష్యాలోని వోల్గా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన నలుగురు వైద్య విద్యార్థుల మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై తగు ఏర్పాట్లు చేసేందుకు సీనియర్‌ అధికారులు తక్షణం విదేశాంగశాఖను, రష్యాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. రష్యాలోని వోల్గోగ్రాడ్‌ రాష్ట్ర మెడికల్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు నదిలో ఈతకెళ్లారు. ఏడుగురు విద్యార్థుల్లో ఒకరు సాయం కోసం కేకలేశారు. దీంతో ఇతరులు సాయం చేయబోయారు. ఈ క్రమంలో నలుగురు విద్యార్థులు నీట మునిగారు. వారంతా తమిళనాడుకు చెందిన వారే. logo