ఆదివారం 12 జూలై 2020
National - Jun 15, 2020 , 01:27:38

తాకకుండానే గంట కొట్టొచ్చు

తాకకుండానే గంట కొట్టొచ్చు

మందసౌర్‌: ఆంక్షల సడలింపు అనంతరం దేశవ్యాప్తంగా ఆలయాలు తిరిగి తెరుచుకున్న నేపథ్యంలో వైరస్‌ నియంత్రణకు ఆయా ఆలయాల నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ అష్టముఖి పశుపతినాథ్‌ మహదేవ్‌ ఆలయంలో ప్రత్యేకంగా ‘సెన్సర్‌ బెల్‌'ను ఏర్పాటుచేశారు. భక్తులు ముట్టుకోకుండానే గంట మోగే విధంగా దీన్ని ఏర్పాటుచేశారు. ముస్లిం మతానికి చెందిన నెహ్రూ ఖాన్‌ మేవ్‌ అనే 62 ఏండ్ల వృద్ధుడు దీన్ని తయారుచేయడం విశేషం. 


logo