ఆదివారం 05 జూలై 2020
National - Jun 17, 2020 , 19:20:22

చైనా ప్లాన్‌ ప్రకారమే దాడి చేసింది

చైనా ప్లాన్‌ ప్రకారమే దాడి చేసింది

న్యూఢిల్లీ : చైనా-భారత్‌ మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌ మాట్లాడుతూ చైనా ప్రణాళిక ప్రకారమే గాల్వాన్‌లో ఘర్షణకు దిగిందని ఆరోపించారు. చైనా పక్క ప్లాన్‌ ప్రకారమే దాడి చేసిందని అన్నారు. దీనిపై భవిష్యత్తులో జరిగే పరిణామాలకు డ్రాగన్‌ దేశం భాత్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

తూర్పు లఢాఖ్‌లోని పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడిన జై శంకర్‌ ఈ విధంగా స్పందించారు. జూన్‌ 6న కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని ఇరువురు నిర్ణయించుకున్నారు.


logo