బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 16:43:06

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో టిఫిన్ బాంబ్‌‌ నిర్వీర్యం

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో టిఫిన్ బాంబ్‌‌ నిర్వీర్యం

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 41వ బెటాలియ‌న్‌కు చెందిన‌ ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీసులు (ITBP) టిఫిన్‌లో అమ‌ర్చి రోడ్డు కింద పాతిపెట్టిన మందుపాత‌రను గుర్తించారు. అనంత‌రం దాన్ని వెలికితీసి నిర్వీర్యం చేశారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం కొండ‌గావ్ జిల్లా న‌హ‌క్నార్ స‌మీపంలోని బ‌య‌నార్ ర‌హ‌దారిలో ఐటీబీపీ పోలీసులు ఆ మందుపాత‌ర‌ను గుర్తించారు.  రోడ్డుప‌క్క‌న వైర్లు తేలి ఉండ‌టాన్ని గ‌మ‌నించిన పోలీసులు ప‌రిశీలించి చూడ‌గా రోడ్డులోప‌ల మందుపాత‌ర అమ‌ర్చి ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు బాంబ్ డిస్పోజ‌ల్ స్క్వాడ్ సాయంతో ఆ మందుపాత‌రను వెలికితీసి నిర్వీర్యం చేశారు. భ‌‌ద్ర‌తాబ‌ల‌గాలే ల‌క్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఆ మందుపాత‌రను అమ‌ర్చి ఉంటార‌ని పోలీసులు తెలిపారు.

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo