మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 15:58:27

అందుకే సుశాంత్‌ కేసులో సీబీఐ దర్యాప్తును కోరలేదు : శ్వేతాసింగ్ ‌కీర్తి

అందుకే సుశాంత్‌ కేసులో సీబీఐ దర్యాప్తును కోరలేదు : శ్వేతాసింగ్ ‌కీర్తి

ముంబై : సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు బదిలీ చేయాలని ఆయన కుటుంబం ఎందుకు డిమాండ్‌ చేయలేదో ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి వెల్లడించారు. సీబీఐ దార్యప్తు కోరి ‘సత్యం కోసం పోరాడండి’ అని ఓ అభిమాని వారి కుటుంబానికి సూచించగా ఆమె దీనిపై స్పందించింది. 

సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తును కోరాలని ఒక అభిమాని శ్వేతా, ఆమె కుటుంబ సభ్యులను కోరాడు. దేశం మొత్తం మీకు మద్దతు ఇస్తుందని చెప్పాడు. దీనికి ఆమె సమాధానమిస్తూ ‘‘ముంబై పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి పూర్తి నివేదికలతో ముందుకు వెళ్తారని మేము ఎదురు చూస్తున్నాం’’ అని అన్నారు. 


ఎంఎస్ ధోనీ, చిచోరె వంటి విజయాలు వచ్చినా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త దేశవ్యాప్తంగా సినీ అభిమానులను కలచివేసింది. ముంబై పోలీసులు ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ హెడ్ ఆదిత్య చోప్రా, చిత్రనిర్మాత మహేశ్‌భట్ సహా సుమారు 38 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా వాంగ్మూలాన్ని కూడా మంగళవారం పోలీసులు రికార్డు చేశారు. జూన్ 14న సుశాంత్ సూసైడ్‌ చేసుకోగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ‘వృత్తిపరమైన శత్రుత్వం’ కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ముంబై పోలీసులు సాధ్యమైన అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అన్నారు.

ఇదిలా ఉండగా సుశాంత్ మరణించినప్పటి నుంచి శ్వేతా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులను పంచుకుంటున్నారు. సోమవారం ఆమె సుశాంత్‌తో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. జూన్ 10న వారు చేసుకున్న చాటింగ్‌ స్క్రీన్ షాట్లను కూడా పంచుకుంది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo