సోమవారం 06 జూలై 2020
National - Apr 09, 2020 , 20:24:07

ఆ డాక్ట‌ర్ ఉండేది కారులోనే

ఆ డాక్ట‌ర్ ఉండేది కారులోనే

క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన వారికి సేవ‌లందిస్తున్న వైద్యులు ప్ర‌స్తుతం ఇండ్ల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి. కొన్ని చోట్ల అద్దె ఇండ్ల‌ల్లో ఉంటున్న వైద్యుల్ని య‌జ‌మానులు ఖాళీ చేయించిన సంగ‌తీ తెలిసిందే.. ఈనేప‌థ్యంలో ఓ డాక్ట‌ర్ కారునే ఇల్లుగా మార్చుకున్నాడు.

కరోనా వైరస్‌ను అంత‌మొంచిందేదుకు వైద్యులు, ఆరోగ్య‌ సిబ్బంది ఎంతగా శ్రమిస్తున్నారో తెలిసిందే.  ఫలితంగా కొందరు డాక్టర్లు, నర్సులకు కూడా ఈ వ్యాధి సోకుతున్న‌ది. ఈ నేపథ్యంలో వైద్యులు ఇళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. భూపాల్‌లోని జేపీ హాస్పిటల్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ సచిన్ నాయక్ కరోనా వైరస్ బాధితులకు సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులను కలవడం లేదు. తనకు కావల్సిన నిత్యవసరాలను కారులోనే ఉంచుకుని కాలం గడుపుతున్నారు. తన వల్ల కుటుంబ సభ్యులకు ఆ పరిస్థితి రాకూడదనే జాగ్రత్తతో కారునే ఇల్లుగా మార్చుకున్నారు. ఆయన కారులో కుర్చొని పుస్తకం చదువుతున్న ఫొటో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


logo