గురువారం 09 జూలై 2020
National - Jun 25, 2020 , 18:32:48

పరీక్షలు వాయిదా వేయాలని కేరళ సీఎంకు శశిథరూర్‌ లేఖ

పరీక్షలు వాయిదా వేయాలని కేరళ సీఎంకు శశిథరూర్‌ లేఖ

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీస్థాయి పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాసినట్లు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ తెలిపారు.  దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ, యూజీసీ పరీక్షలు ఇప్పటికే వాయిదా వేశారు. కేరళ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ ప్రభుత్వాన్ని కోరాలని తనకు 3800ఈ-మెయిల్స్‌ పంపారని పేర్కొన్నారు.

విద్యార్థులు వారి తల్లిదండ్రులు, వృద్ధులతో కలిసి ఉండడంతో సహజంగా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, ఇలాంటి సవాళ్లు బలమైన ప్రాధాన్యం కలిగి ఉన్నందున ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు  ప్రజారవాణాను తగ్గించాలని, ఇంటర్‌నెట్‌ కేఫ్‌లను మూసివేయాలని, ప్రజలు భౌతికదూరం పాటించేలా చూడాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.  


logo