గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 03:20:44

పీఎం కేర్స్‌ నుంచి 3,100 కోట్లు!

పీఎం కేర్స్‌ నుంచి 3,100 కోట్లు!

న్యూఢిల్లీ: పీఎం కేర్స్‌ ఫండ్‌ నుంచి కేంద్రం తొలిసారి నిధులు కేటాయించింది. కరోనాపై పోరుకు రూ.3,100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధాని మోదీ బుధవారం ప్రకటించారు. ఇందులో వెంటిలేటర్ల కొనుగోలుకు రూ.2వేల కోట్లు, వలస కార్మికుల రక్షణ కోసం రూ.వెయ్యి కోట్లు, వ్యాక్సిన్‌ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. 


logo