కొత్త భయం

- లండన్ నుంచి భారత్‌కు వచ్చిన వాళ్లలో 20 మందికి పాజిటివ్.. నమూనాల సేకరణ
- ‘కొత్త రకం కరోనా’ నిర్ధారణ కోసం పరీక్షలు
- కేంద్రం అలర్ట్.. మార్గదర్శకాలు జారీ
- దేశంలో కొత్త రకం కరోనా లేదని వెల్లడి
- బ్రిటన్ బయటే వేలాది ఫుడ్ ట్రక్కులు
- ఆ దేశానికి పొంచి ఉన్న ఆహార ముప్పు
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూడటంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలను ముమ్మరం చేశాయి. బ్రిటన్ రాజధాని లండన్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కనీసం 20 మందిలో కొవిడ్-19 పాజిటివ్ గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన నిబంధనలను (ఎస్‌వోపీలను) కేంద్రం మంగళవారం ప్రకటించింది.
ఎన్సీడీసీకి నమూనాలు
బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన విమాన ప్రయాణికుల్లో కనీసం 20 మందికి కొవిడ్-19 పాజిటివ్ గుర్తించినట్టు మంగళవారం అధికారులు తెలిపారు. లండన్ నుంచి ఢిల్లీకి సోమవారం రాత్రి 11.30 గంటలకు చేరుకున్న విమానంలోని ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. బ్రిటన్ నుంచి ఇదే విమానంలో ఢిల్లీ చేరుకున్న మరొక ప్రయాణికుడు ఇంకో విమానంలో చెన్నైకి వెళ్లాడు. అక్కడ చేసిన పరీక్షల్లో అతనికి కూడా పాజిటివ్ అని తేలింది. పాజిటివ్‌గా తేలిన వాళ్లలో కొత్త రకం కరోనా వైరస్ ఉన్నదా? లేదా? తెలుసుకోవడానికి ఆ నమూనాలను ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)కు పంపించారు. లండన్ నుంచి కోల్‌కతాకు చేరుకున్న వాళ్లలో ఇద్దరికి, అహ్మదాబాద్‌కు వచ్చిన వాళ్లలో నలుగురికి వైరస్ సోకినట్టు గుర్తించారు. లండన్ నుంచి అమృత్సర్ చేరుకున్న 8మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. బాధితులంతా ఎయిరిండియాకు చెందిన విమానాల్లోనే ప్రయాణించినట్టు వివరించారు. బ్రిటన్ నుంచి ముంబైకి మంగళవారం చేరుకున్న 590 మంది ప్రయాణికుల్లో ఎవరికీ వైరస్ లక్షణాలు కనిపించలేదన్నారు.
ప్రత్యేక ఐసోలేషన్‌లోనే..
- కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) నిర్దేశించింది. అది ఏమిటంటే..
- డిసెంబర్ 21 నుంచి 23 మధ్య బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టుల్లోనే విధిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయాలి.
- పాజిటివ్ వచ్చిన వాళ్లను ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలి.
- బాధితుల్లో కొత్త రకం వైరస్ ప్రభావం ఉన్నదో లేదో తెలుసుకునేందుకు పాజిటివ్‌గా తేలిన నమూనాలపై పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో స్పైక్-ఆధారిత జన్యుపరమైన పరీక్షలను జరుపాలి.
- బాధితుల్లో కొత్తరకం వైరస్ ఉన్నట్లయితే, వాళ్లను ప్రత్యేక ఐసోలేషన్ యూనిట్‌కు తరలించాలి. 14 రోజుల చికిత్స అనంతరం మళ్లీ పరీక్ష నిర్వహించాలి.
- నెగెటివ్ వచ్చిన వాళ్లు 14రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండాలి. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలి.
టీకా సమర్థతపై ప్రభావం ఉండబోదు!
లండన్/న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ఇటీవల వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్.. సంబంధిత వ్యాక్సిన్ల సమర్థతపై ప్రభావం చూపబోదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ వైరస్ భవిష్యత్తులో మరికొన్ని ఉత్పరివర్తనాలకు లోనయ్యే ప్రమాదమున్నదని హెచ్చరించారు. వైరస్ కట్టడికి ఆయా దేశాలు ముమ్మర చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి 70 శాతం ఎక్కువ వేగంగా జరుగుతున్నదని, దాన్ని అరికట్టడం సవాలుతో కూడుకున్నదని లండన్ శాస్త్రవేత్త జెరేమీ ఫరార్ తెలిపారు. బ్రిటన్‌లో తాజాగా గుర్తించిన ‘వీయూఐ-202012/01’ రకం కరోనా వైరస్ 13 రకాల ఉత్పరివర్తనాలకు గురైందని నోయిడాలోని శివ్ నాడర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దీపక్ సెహగల్ పేర్కొన్నారు. వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో ఉన్న ‘ఎన్501వై’ ఉత్పరివర్తనం వల్లే కొత్త రకం కరోనా.. 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తున్నదని వివరించారు. వైరస్ ఎక్కువ ఉత్పరివర్తనాలకు లోనైతే, వ్యాక్సిన్ల పనితీరుపై ప్రభావం చూపవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఫ్లూ తరహా వైరస్‌తో పోల్చి చూస్తే, సార్స్-కోవ్-2 వైరస్‌లో (కరోనా వైరస్‌లో) జరుగుతున్న ఉత్పరివర్తనాలు తక్కువగానే ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు, పిల్లలపై ‘వీయూఐ-202012/01’ వైరస్ ప్రభావం ఏ విధంగా ఉన్నదన్న అంశంపై బ్రిటన్ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.
వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో ఉన్న ‘ఎన్501వై’ ఉత్పరివర్తనం వల్లే కొత్త రకం కరోనా.. 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపిస్తున్నది.
తాజావార్తలు
- కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!
- డ్రైవర్‌ను కొట్టిన ప్రముఖ నటుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
- పూరి, విజయ్ సినిమా.. టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలకు టైం ఫిక్స్
- విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం
- కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భారత్ టాప్
- దీప్‌సింగ్ సహా పలువురికి ఎన్ఐఏ సమన్లు: రైతు నేతల ఫైర్
- శ్రీను వైట్ల టు బాబీ..రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు వీళ్లే
- యాడ్ జింగిల్స్ సాంగ్.. వావ్! ఎంత బాగుందో..
- 'నా వ్యాఖ్యలు నొప్పిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం'