బుధవారం 27 జనవరి 2021
National - Nov 28, 2020 , 14:22:36

ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను ఉగ్ర‌వాదులు అడ్డుకుంటున్నారు : ఆర్మీ చీఫ్‌

ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను ఉగ్ర‌వాదులు అడ్డుకుంటున్నారు : ఆర్మీ చీఫ్‌

హైద‌రాబాద్‌: దేశ ప‌శ్చిమ స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా ఉంద‌ని,  ఉగ్ర‌వాదం ఆ ప్రాంతంలో ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని, అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఉగ్ర‌వాదం త‌గ్గ‌డంలేద‌ని ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణే తెలిపారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోకి చొర‌బ‌డేందుకు ఉగ్ర‌వాదులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, ప్రజాస్వామ్య ప్ర‌క్రియ‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. శీతాకాలం ప్ర‌వేశించ‌డంతో.. స‌రిహ‌ద్దుల వ‌ద్ద చొర‌బాటు సంఘ‌ట‌న‌లు పెరిగిన‌ట్లు ఆయ‌న చెప్పారు. మంచు తీవ్ర‌త పెర‌గ‌క‌ముందే ఉగ్ర‌వాదులు చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నిస్తార‌న్నారు. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వెంట ఉన్న ట‌న్నెళ్ల నుంచి ఉగ్ర‌వాదులు భార‌త భూభాగంలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని న‌ర‌వాణే తెలిపారు. 


logo