ఆదివారం 20 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 11:25:01

బీజేపీ నాయకుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు

బీజేపీ నాయకుడిని కాల్చిచంపిన ఉగ్రవాదులు

బుద్గామ్‌ : జమ్ముకశ్మీర్‌లో బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఉన్మాదం సాగిస్తున్నారు. బుద్గామ్‌ జిల్లాలో గడిచిన నెలరోజుల్లో పలువురి బీజేపీ నాయకులను వారి కుటుంబ సభ్యులను హతమార్చారు. ఆదివారం తాజాగా బీజేపీ అదర్ బ్యాక్‌వర్డ్ క్లాస్ (ఓబీసీ) మోర్చా బుద్గామ్‌ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ నజార్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం పోలీసులు దవాఖానకు తరలించగా మృతి చెందాడు.

అబ్దుల్ హమీద్ నజార్‌ బుద్గామ్‌లోని మోహింద్‌పోరా ప్రాంతంలో ఇంట్లో ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు బుద్గామ్‌ ఎస్‌ఎస్‌పీ అమోద్ నాగ్‌పూర్ చెప్పారు. అంతకుముందు ఆగస్టు 6న కుల్గాంలో బీజేపీ సర్పంచ్ సాజాద్ అహ్మద్ ఖండేను కాల్చి చంపిన విషయం తెలిసిందే. జులైలో, బండిపోరా బీజేపీ మాజీ అధ్యక్షుడు వసీం బారి, అతని తండ్రి, సోదరుడుపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు.


logo