మెల్బోర్న్:రానున్న సీజన్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కొత్త కాంట్రాక్టులను ప్రకటించింది. 17 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను సీఏ శుక్రవారం విడుదల చేసింది. దేశవాళీ టోర్నీలతో పాటు అంతర్జాతీయ అరంగేట్రంలోనూ ఆకట్టుకున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌కు కొత్తగా కాంట్రాక్టు లభించింది. స్వదేశంలో భారత్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 21 ఏండ్ల గ్రీన్ 33.71 సగటుతో 236 పరుగులు చేశాడు.