సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 10:42:59

జ‌మ్ములో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌పై ఉగ్ర‌వాదుల దాడి

జ‌మ్ములో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌పై ఉగ్ర‌వాదుల దాడి

శ్రీనగ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి. ద‌క్షిణ క‌శ్మీర్‌లోని షోపియాన్‌లో ఉన్న మినీ సెక్ర‌టేరియ‌ట్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ గ‌స్తీ బృందంపై ఉగ్ర‌వాదులు దాడిచేశారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జ‌వాన్లు మినీ సెక్ర‌టేరియ‌ట్ ప్రాంతాన్ని జ‌వాన్లు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మ‌రం చేశారు. అద‌న‌పు బ‌ల‌గాల‌ను ఆ ప్రాంతానికి త‌ర‌లిస్తున్నారు. 

నిన్న ఉద‌యం బుద్గాం జిల్లాలోని ఛ‌దూరా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదులు కాల్పు‌లు జ‌రిపారు. దీంతో  ఓ ఏఎస్ఐ మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.  

అదేవిధంగా అనంత్‌నాగ్ జిల్లాలోని సిర్హ‌మా ప్రాంతంలో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా ద‌ళాల‌కు మ‌ధ్య భారీగా కాల్పులు కొన‌సాగుతున్నాయి. నిన్న మ‌ధ్య మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మైన ఎన్‌కౌంట‌ర్ ఇంకా కొన‌సాగుతున్న‌ది. 


logo