బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 13:51:36

సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదుల కాల్పులు

సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదుల కాల్పులు

షోపియాన్‌: జ‌మ్ముక‌శ్మీర్‌ను కేంద్ర‌పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత ఉగ్ర‌వాద‌ కార్య‌క‌లాపాల‌పై భ‌ద్ర‌తా ద‌ళాలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉగ్ర‌వాదుల ఏరివేత‌ను మొద‌లు పెట్టాయి. ఈ నేప‌థ్యంలో జ‌మ్ములోని షోపియాన్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాలు, జ‌మ్ముక‌శ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేప‌ట్టాయి. ఈ బృందంపై ఆదివారం మ‌ధ్యాహ్నం ఉగ్ర‌వాదులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఒక్క‌సారిగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న నుంచి తేరుకున్న భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప్ర‌తిఘ‌టించేలోపే ఉగ్ర‌వాదులు అక్క‌డినుంచి పారిపోయార‌ని పోలీసులు తెలిపారు. వారికోసం గాలింపు చేప‌ట్టార‌ని వెల్ల‌డించారు. ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ద‌ని, ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని, ఎవ‌రికీ గాయాల‌వ‌లేద‌ని ప్ర‌క‌టించారు. 

జూలై 24న జ‌మ్ములోని ర‌న్‌బీర్‌గ‌ఢ్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ల‌ష్క‌రే తొయీబా క‌మాండ‌ర్ ఇషాక్ ర‌షీద్‌ఖాన్, అత‌ని అనుచ‌రుడు ఇజాజ్ అహ్మ‌ద్ భ‌ట్ హ‌త‌య్యారు. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు క‌శ్మీర్‌లో 143 మంది ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తాద‌ళాలు మ‌ట్టుబెట్టాయి.  


logo