బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 11:11:30

శ్రీన‌గ‌ర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం

శ్రీన‌గ‌ర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తాద‌ళాల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్ద‌రు ఉగ్ర‌వాదు హ‌తమ‌య్యారు. శ్రీన‌గ‌ర్ శివార్ల‌లోని ర‌ణ్‌బీర్‌గ‌ఢ్ ప్రాంతంలో ఇద్ద‌రు నుంచి ముగ్గురు ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారంతో భ‌ద్ర‌త ద‌ళాలు, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు, జ‌మ్ముక‌శ్మీర్ స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్ పోలీసులు సంయుక్తంగా శ‌నివారం తెల్ల‌వారుజామున గాలింపు చేప‌ట్టాయి. 

అయితే భ‌ద్ర‌తా ద‌ళాల‌పై ఉగ్ర‌వాదులు ఒక్క‌సారిగా గుండ్ల వ‌ర్షం కురిపించార‌ని, దీంతో ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యార‌‌ని క‌శ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. మ‌ర‌ణించిన‌వారిని ఇంకా గుర్తించ‌లేద‌ని వెల్ల‌డించారు.   

క‌శ్మీర్‌లో జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 143 మంది ఉగ్ర‌వాదులను భ‌ద్ర‌తాద‌ళాలు ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ట్టుబెట్టాయి.


logo