సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 11:50:40

కుప్వారాలో ఉగ్రవాది హతం

కుప్వారాలో ఉగ్రవాది హతం

కశ్మీర్‌ : ఉత్తర కాశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని మచిల్‌ ప్రాంతంలో చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. శనివారం రాత్రి 7-8 గంటల ప్రాంతంలో మాచిల్‌ సెక్టార్‌లో తీర నియంత్రణ రేఖ సమీపంలో పెట్రోలింగ్‌ పార్టీ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తుల అనుమానాస్పద కదలికలను గుర్తించినట్లు జీఎన్‌ఎస్‌ చెందిన ఓ అధికారి తెలిపారు. దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తున్న మిలిటెంట్లను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో కొద్ది సేపు కాల్పులు జరిగాయని అధికారి పేర్కొన్నారు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో మృతదేహంతో పాటు ఒక ఏకే రైఫి, రెండు సంచులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి ఉండవచ్చని కోణంలో ఆపరేషన్‌ను బలగాలు కొనసాగిస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.