బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 06, 2020 , 08:55:20

క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఉగ్ర‌వాది హ‌తం

క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఉగ్ర‌వాది హ‌తం

శ్రీన‌గ‌ర్‌: జమ్ముశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేత కొన‌సాగుతున్న‌ది. పుల్వామా జిల్లా పాంపోర్‌లోని లాల్‌పొరా గ్రామంలో ఇవాళ ఉద‌యం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. లాల్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తం‌గా నిన్న రాత్రి  గాలింపు చేపట్టారు. ఈ క్ర‌మంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపార‌ని క‌శ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గాయపడ్డార‌ని, ఓ ఉగ్రవాది మరణించాడ‌ని వెల్ల‌డించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొన‌సాగుతున్న‌ద‌ని చెప్పారు.