మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 02:48:42

‘కేజ్రీవాల్‌కు ఉగ్రవాది అనే పదం సరైనదే!’

‘కేజ్రీవాల్‌కు ఉగ్రవాది అనే పదం సరైనదే!’


న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఓపీ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీతో బుధవారం భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేజ్రీవాల్‌ అవినీతిపరుడు. ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపాడు. పాకిస్థాన్‌ సైన్యం అధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్నాడు. భారత సైన్యంపై తరుచుగా ప్రశ్నలు సంధిస్తున్నాడు. తుక్డే తుక్డే గ్యాంగ్‌కు మద్దతు తెలుపుతున్నాడు. కేజ్రీవాల్‌కు ఉగ్రవాది అనే పదం తగినదే’ అని శర్మ పేర్కొన్నారు.
logo