శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 15:11:15

లాకర్‌లో లక్షల్లో డబ్బుల కట్టలు.. తినేసిన చెదలు

లాకర్‌లో లక్షల్లో డబ్బుల కట్టలు.. తినేసిన చెదలు

అహ్మదాబాద్‌: బ్యాంక్‌ లాకర్‌లో దాచుకున్న లక్షలాది డబ్బుల కట్టలను చెదలు తినేశాయి. దీంతో ఒక కస్టమర్‌ లబోదిబోమంటూ బ్యాంకు అధికారులను ఆశ్రయించాడు. చెదలవల్ల నష్టపోయిన డబ్బును తనకు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. గుజరాత్‌లోని వడోదరలో ఈ ఘటన జరిగింది. రెహ్నా కుతుబీద్దీన్‌ దేసర్వాల్ అనే వ్యక్తి ప్రతాప్‌ నగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్ బరోడా శాఖ లాకర్‌లో రూ.2.20 లక్షల నగదును దాచుకున్నాడు. అయితే ఇటీవల లాకర్‌ను తెరిచి చూడగా ఆ డబ్బుల కట్టలకు పట్టిన చెదలు నోట్లను తినేశాయి. దీంతో అతడు దీని గురించి బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. తాను నష్టపోయిన డబ్బులను బ్యాంక్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. కాగా డబ్బులను బ్యాంక్‌ లాకర్‌లో దాచుకున్నప్పటికీ రక్షణ ఉండదని ఇలాంటి ఘటనల ద్వారా తెలుస్తున్నది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo