శుక్రవారం 10 జూలై 2020
National - Jun 15, 2020 , 13:37:04

ఇంటి కిరాయి క‌ట్ట‌లేద‌ని గాల్లోకి కాల్పులు.. బెదిరిపోయిన కిరాయిదారు.. వీడియో

ఇంటి కిరాయి క‌ట్ట‌లేద‌ని గాల్లోకి కాల్పులు.. బెదిరిపోయిన కిరాయిదారు.. వీడియో

బెంగ‌ళూరు: ‌కిరాయిదారులు రెంటు క‌ట్ట‌క‌పోతే ఏ ఇంటి య‌జ‌మాని అయినా ఏం చేస్తాడు? ఇంటి ముందు గొడ‌వ చేస్తాడు! ఇళ్లు ఖాళీ చేయ‌మ‌ని హుకుం జారీ చేస్తాడు! అయినా క‌ట్ట‌క‌పోతే ఇంట్లోని సామాను తీసి బ‌య‌ట‌ప‌డేస్తాడు! కానీ క‌ర్ణాటక‌‌లో ఓ ఇంటి య‌జ‌మాని మాత్రం ఇంత‌కంటే ఎక్కువే చేశాడు. రెండు క‌ట్ట‌డంలో విఫ‌ల‌మైన కిరాయిదారుడిని బెదిరించ‌డానికి ఏకంగా గాల్లోకి కాల్పులు జ‌రిపాడు. అక‌స్మాత్తుగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో కిరాయిదారు బెదిరిపోయాడు. 

క‌ర్ణాట‌క రాష్ట్రం బెల్గామ్ జిల్లాలోని చిక్కోడి ఏరియాలో ఆదివారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఇంటి అద్దె అడిగిన య‌జ‌మానికి కిరాయిదారుడు డ‌బ్బులు లేవ‌ని స‌మాధానం ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ఆ ఇంటి ఓన‌ర్ త‌న జేబులోని రివాల్వ‌ర్ తీసి గాల్లోకి రెండుమూడు రౌండ్లు కాల్పులు జ‌రిపాడు. ఈ హ‌ఠాత్ప‌రిమాణంతో వ‌ణికిపోయిన కిరాయిదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఇంటి య‌జ‌మానిని అరెస్ట్ చేశారు. 

 logo