శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 30, 2020 , 23:06:44

ఐఏఎఫ్‌కు అభినందనలు తెలిపిన సచిన్‌

ఐఏఎఫ్‌కు అభినందనలు తెలిపిన సచిన్‌

న్యూఢిల్లీ : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండ్కులర్‌ భారత వైమానిక దళాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. అత్యాధునిక ‘పైటర్‌ జెట్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలను చేర్చినందుకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు హృదయపూర్వక అభినందనలు’ అంటూ ట్వీట్‌ చేశారు. యుద్ధ విమానాల చేరిక‌తో మ‌న దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతంగా తయారైంది. రాఫెల్‌ విమానాల రాకతో రక్షణ దళాల్లో భారీ నవీకరణ మొదలైంది. జైహింద్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా, సచిన్‌ ఐఏఎఫ్‌లో గ్రూప్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ ఏవియేషన్‌ తయారు చేసిన 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను రూ.59వేల కోట్లకు కొనుగోలు చేయడానికి 2016 ఎన్‌డీఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంట్లో భాగంగా రెండు రోజుల కిందట ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఫ్రాన్స్‌ నుంచి ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలు ఏడు కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం సాయంత్రం హర్యానా అంబాలాలోని వైమానిక స్థావరానికి చేరుకున్న సంగతి తెలిసిందే.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo