బుధవారం 20 జనవరి 2021
National - Dec 24, 2020 , 07:49:33

12వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేలు!

12వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేలు!

కోల్‌కతా : ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్న 12వ తరగతి విద్యార్థులు అందుకు అవసరమైన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబెట్‌లను కొనుక్కోవడానికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున అందజేస్తామని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ చెప్పారు. ఆన్‌లైన్‌ తరగతులకు ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌ ఫోన్లు అవసరమని, వీటిని అందజేస్తామని గతంలో తాము హామీ ఇచ్చామని, అయితే ప్రభుత్వ పాఠశాలలు, మదర్సాలలో చదువుతున్న దాదాపు 9.5 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులకు సరిపడా ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌ ఫోన్లను అందజేయడం కొంత కష్టంగా ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఖాతాలో డబ్బులు జమచేస్తామని, ఆ డబ్బుతో వాళ్లు స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు.logo