ఆదివారం 24 జనవరి 2021
National - Oct 14, 2020 , 16:41:24

ఏపీలో కుంభ‌వృష్టి.. 10 మంది మృతి

ఏపీలో కుంభ‌వృష్టి.. 10 మంది మృతి

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాల కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. మ‌రికొన్ని ప్రాంతాల్లో ర‌హ‌దారులు తెగిపోయాయి. కృష్ణా న‌ది ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న‌ది. దీంతో ప్ర‌కాశం బ్యారేజీ నుంచి 6.46 క్యూసెక్కుల నీటిని దిగువకు వ‌దులుతున్నారు. దానివ‌ల్ల న‌దికి కుడి, ఎడ‌మ భాగాల్లో ఉన్న ఆవాస ప్రాంతాలు నీట మునిగే అవ‌కాశం ఉండ‌టంతో అధికారులు రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు జారీచేశారు.

ఈ నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఉన్న‌త‌స్థాయి స‌మావేశం ఏర్పాటు చేసి ప‌రిస్థితిని స‌మీక్షించారు. జిల్లా కలెక్ట‌ర్‌లు, ఇత‌ర‌ అధికారులు, పోలీసులు అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం సూచించారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాలవ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 10 మంది మృతిచెందిన‌ట్లు ఏపీ సీఎం కార్యాల‌యం వెల్ల‌డించింది. మృతులంద‌రికీ ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించార‌ని ఏపీ సీఎంవో తెలిపింది. అయితే, ఎక్స్‌గ్రేషియా ఎంత అనే విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని పేర్కొన్న‌ది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo