గురువారం 04 జూన్ 2020
National - May 14, 2020 , 15:10:18

స‌రిహ‌ద్దుల్లో అప్పుడ‌ప్పుడు ఘ‌ర్ష‌ణ‌లు త‌ప్ప‌వు : ఆర్మీ చీఫ్‌

స‌రిహ‌ద్దుల్లో అప్పుడ‌ప్పుడు ఘ‌ర్ష‌ణ‌లు త‌ప్ప‌వు : ఆర్మీ చీఫ్‌

హైద‌రాబాద్‌: భార‌తీయ స‌రిహ‌ద్దుల వ‌ద్ద భ‌ద్ర‌తా ద‌ళాలు నిత్యం శాంతిని, సామ‌రస్యాన్ని పాటిస్తున్నాయ‌ని ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణే తెలిపారు.  ఉత్త‌ర స‌రిహ‌ద్దుల వ‌ద్ద రోడ్డు నిర్మాణ కార్య‌క్ర‌మాలు చురుగ్గా సాగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కోవిడ్19 మ‌హమ్మారి వ‌ల్ల మ‌న ద‌ళాల‌కు ఎటువంటి న‌ష్టం ఉండ‌ద‌న్నారు. మ‌హ‌మ్మారి వేళ బోర్డ‌ర్ రోడ్డు ఆర్గ‌నైజేష‌న్ అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. స‌రిహ‌ద్దుల్లో జీవిస్తున్న సాధార‌ణ పౌరుల‌కు సేవ‌లందించ‌డే ల‌క్ష్యంగా రోడ్డు నిర్మాణాలు జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు. లైన్ ఆఫ్ యాక్టువ‌ల్ కంట్రోల్ వద్ద అప్పుడ‌ప్పుడు ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతుంటాయ‌ని ఆర్మీ చీఫ్ తెలిపారు. స‌రిహ‌ద్దు రేఖ‌లు సంపూర్ణంగా తేల‌క‌పోవ‌డం వ‌ల్ల ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌, నార్త‌ర్న్ సిక్కింలో ఇటీవ‌ల రెండు సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న‌ట్లు చెప్పారు. ఇరు వైపుల ద‌ళాల‌కు స్వ‌ల్ప స్థాయిలో గాయాలు అయిన‌ట్లు తెలిపారు. అయితే స్థానిక స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిగిన త‌ర్వాత ఉద్రిక్త వాతావ‌ర‌ణం త‌గ్గింద‌ని ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే తెలిపారు. 


logo