బుధవారం 27 మే 2020
National - May 22, 2020 , 02:32:23

కర్ణాటకలో పూజలు ప్రత్యక్ష ప్రసారం

కర్ణాటకలో పూజలు ప్రత్యక్ష ప్రసారం

బెంగళూరు: ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యాక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల రద్దీ ఉండకుండా చూడాలంటూ కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని భావిస్తున్నది. సమాచారాన్ని భక్తులకు చేరవేయడానికి, ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరించడానికి ఓ యాప్‌ను, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.


logo