శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 17:30:06

శ్రీరాముడి త‌ల్లి కౌస‌ల్య ఆల‌యం సుంద‌రీక‌ర‌ణ

శ్రీరాముడి త‌ల్లి కౌస‌ల్య ఆల‌యం సుంద‌రీక‌ర‌ణ

రాయ‌పూర్‌: శ్రీరాముడి త‌ల్లి కౌస‌ల్య ఆల‌యాన్ని మ‌రింత సుంద‌రంగా తీర్చిదిద్ద‌నున్నారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ‌పూర్‌కు 27 కిలోమీట‌ర్ల దూరంలోని చంద్ర‌కూరి గ్రామంలో ఈ ఆల‌యం ఉన్న‌ది. శ్రీరాముడి మాతృ గ్రామంలో నెల‌కొన్న పురాత‌న మాతా కౌస‌ల్య ఆల‌యం సుందరీకరణ, విస్త‌ర‌ణ‌కు శంకుస్థాప‌న చేసిన‌ట్లు ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం భూపేశ్ బాగెల్ బుధ‌వారం తెలిపారు. ఆగ‌స్టు 3వ‌ వారం నుంచి ఈ ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఆయ‌న చెప్పారు. అయోధ్యలో నిర్మించ‌నున్న శ్రీరామ భ‌వ్య మందిరానికి ఆగ‌స్టు 5న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని చంద్ర‌కూరి గ్రామంలో ఉన్న శ్రీరాముడి త‌ల్లి మాతా కౌస‌ల్య ఆల‌యం సుందరీకరణ‌, విస్త‌ర‌ణ ప‌నులు చేప‌ట్ట‌నుండ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది.logo