సోమవారం 06 జూలై 2020
National - Jun 16, 2020 , 11:22:25

క‌రోనా మాయ.. గుడిలో గంట దానిక‌దే మోగుతుంది!

క‌రోనా మాయ.. గుడిలో గంట దానిక‌దే మోగుతుంది!

జూన్ 8 నుంచి దేవాల‌యాల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో దైవ ద‌ర్శ‌నానికి భ‌క్తులు పెద్ద సంఖ్యలో వ‌స్తున్నారు. పూజ త‌ర్వాత గంట కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న భ‌క్తుల‌కు అనుకోని సంఘ‌ట‌న ఎదురైంది.  గంట కొట్టేందుకు చేతులు పైకి  ఎత్త‌గానే దానంత‌ట అదే మోగుతున్న‌ది. దీంతో అక్క‌డి వారంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇదంతా దేవుడి మాయ అనుకున్నారు. నిజానికి ఇది దేవుడి మాయ కాదు. క‌రోనా మాయ‌. ఆలయంలో ఉండే గుడి గంటల ద్వారా కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందనే ఆందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ప‌శుప‌తినాథ్ ఆలయం అధికారులకు సరికొత్త ఐడియా వచ్చింది. భ‌క్తులు గంట తాక‌కుండానే మోగేలా ఏర్పాట్లు చేశారు. భ‌క్తులు గంట ద‌గ్గ‌ర‌కు వెళ్లి సెన్సార్‌కు చేయి చేపిస్తే చాలు గంట దానిక‌దే మోగుతుంది. ఈ సెన్సార్ గంట త‌యారీకి  న‌హ్రు ఖాన్ అనే ముస్లిం వ్య‌క్తి త‌యారు చేయ‌డం గ‌మ‌నార్హం.
logo