గురువారం 21 జనవరి 2021
National - Jan 11, 2021 , 12:27:12

క‌శ్మీర్‌లో చ‌లి పంజా.. గ‌డ్డ‌క‌ట్టిన దాల్ స‌ర‌స్సు..!

క‌శ్మీర్‌లో చ‌లి పంజా.. గ‌డ్డ‌క‌ట్టిన దాల్ స‌ర‌స్సు..!

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో చ‌లిపంజా విసురుతున్న‌ది. అక్క‌డి ఉష్ణోగ్ర‌త‌లు అత్యంత క‌నిష్ట స్థాయికి ప‌డిపోయాయి. ఈ రోజు మ‌ధ్యాహ్నానికి క‌శ్మీర్‌లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ 0 డిగ్రీ సెంటీగ్రేడ్‌, గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌ 6 డిగ్రీ సెంటీగ్రేడ్‌గా న‌మోదైందని భార‌త వాతావ‌ర‌ణ విభాగం అధికారులు వెల్ల‌డించారు. ఈ అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా దాల్ స‌ర‌స్సులోని గ‌రిష్ఠ భాగం పూర్తిగా గ‌డ్డ‌క‌ట్టుకుపోయింది. స‌ర‌స్సు తీర భాగాలు మంచుగడ్డ‌లు ప‌రిచిన‌ట్టుగా క‌నిపిస్తున్నాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo