శుక్రవారం 05 జూన్ 2020
National - May 10, 2020 , 08:11:11

మండుతున్న ఎండ‌లు.. ఢిల్లీలో 42 డిగ్రీలు, రాజ‌స్థాన్‌లో 45 డిగ్రీలు

మండుతున్న ఎండ‌లు.. ఢిల్లీలో 42 డిగ్రీలు, రాజ‌స్థాన్‌లో 45 డిగ్రీలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండ‌లు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకే పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు రాజ‌స్థాన్‌లో భానుడి ప్ర‌తాపం మరింత తీవ్రంగా ఉన్న‌ది. శనివారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాలంలో గరిష్టంగా 42.2 డిగ్రీ సెల్సియస్, సఫ్దర్‌జంగ్‌లో 40.9 డిగ్రీ సెల్సియస్ గ‌రిష్ట‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక‌ రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం కూడా రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అయితే ఢిల్లీలో మాత్రం ఆదివారం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అక్క‌డి వాతావ‌ర‌ణ విభాగం అధికారులు వెల్ల‌డించారు. ఇక దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లోనూ 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి.  


logo