శనివారం 16 జనవరి 2021
National - Dec 23, 2020 , 01:32:35

బెంగాల్‌లో అధికారిక భాషగా తెలుగు

బెంగాల్‌లో అధికారిక భాషగా తెలుగు

కోల్‌కతా: తెలుగును అధికారిక భాషగా గుర్తించేందుకు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. తెలుగును అధికారిక భాషగా ప్రకటించాలని అక్కడి తెలుగువారు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. ఖరగ్‌పూర్‌ ప్రాంతంలో తెలుగువారు నివసిస్తున్నారు. ఇప్పటికే బెంగాల్‌లో 10కిపైగా అధికారిక భాషలు ఉన్నాయి.