గురువారం 04 జూన్ 2020
National - May 09, 2020 , 20:24:29

తెలుగు వారి కోసం పుణెలో కమ్యూనిటీ కిచెన్లు

తెలుగు వారి కోసం పుణెలో కమ్యూనిటీ కిచెన్లు


హైదరాబాద్‌: కరోనా వైరస్‌  వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలసకార్మికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. వీరి ఆకలి కేకలను చూసిన పుణెలోని ఐఆర్‌ఎస్‌ అధికారి నేలపట్ల అశోక్‌బాబు.. వారి కోసం కమ్యూనిటీ కిచెన్లను ప్రారంభించారు. పుణె పట్టణంతోపాటు శివారులో పెద్ద సంఖ్యలో ఉన్న పరిశ్రమల్లో వేల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు కార్మికులు ఉన్నారు. వలస కార్మికుల ఆకలి బాధలు చూడలేక మొత్తం  106 కమ్యూనిటీ  కిచెన్లను ప్రారంభించి వీరి ఆకలి తీరుస్తున్నారు. నిత్యం దాదాపు 1.5 లక్షల మంది కార్మికులు ఈ కమ్యూనిటీ కిచెన్లకు వచ్చి వారి క్షుద్భాద తీర్చుకొంటున్నారు. చిక్కుకుపోయిన వలస కార్మికులకు కూడా ఆశ్రయాలు కల్పిస్తున్నారు. కమ్యూనిటీ కిచెన్లను ప్రారంభించి కార్మికులకు నిత్యం  అన్నం  పెడుతున్న అశోక్‌బాబు తీరుపట్ల తెలుగు కార్మికులు, తెలుగు ఎన్జీవోలు కృతజ్ఞతలు తెలిపాయి.


logo