బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 10, 2020 , 13:01:41

ప్రధానమంత్రి మోదీకీ సౌదీ అరేబియా రాజు ఫోన్

 ప్రధానమంత్రి మోదీకీ సౌదీ అరేబియా రాజు ఫోన్

ఢిల్లీ :ప్రధానమంత్రి  నరేంద్ర మోదీకీ సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ‌ఫోన్ లో మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో, ప్రపంచ సవాళ్ళపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జి-20 దేశాల బృందానికి అధ్యక్ష పదవిలో సౌదీ అరేబియా అందించిన నాయకత్వానికి ప్రధానమంత్రి ప్రశంసలు తెలిపారు. మహమ్మారికి వ్యతిరేకంగా, జి-20 స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు, సమన్వయ ప్రతిస్పందనను ప్రోత్సహించడంలో సహాయపడ్డాయని ఇరువురు నాయకులు అంగీకరించారు.

జి-20 ఎజెండాలో ప్రస్తుతం ఉన్న ప్రధాన ప్రాధాన్యతలపై కూడా వారు చర్చించారు. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఇరువురు నాయకులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.  అన్ని రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలో సౌదీ అధికారులు ప్రవాస భారతీయులకు అందించిన సహకారానికి ప్రధానమంత్రి మోదీ  సౌదీ అరేబియా రాజు సల్మాన్ ‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo