బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 06:17:51

బల్క్‌ కాల్‌ డేటా కోరుతున్నారు..

బల్క్‌ కాల్‌ డేటా కోరుతున్నారు..

- టెలికాం విభాగాల తీరుపై సంస్థల ఆందోళన

న్యూఢిల్లీ: టెలికాం శాఖకు చెందిన కొన్ని విభాగాలు రికాైర్డెన కాల్‌ డేటాను బల్క్‌గా కోరుతున్నాయని పలు టెలికాం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఫిబ్రవరి 2,3, 4 తేదీల్లో రికాైర్డెన రాష్ట్ర వ్యాప్త సమాచారంతోపాటు మంత్రులు, ఎంపీలు, జడ్జీలు, ముఖ్యకార్యాలున్న రూట్లకు సంబంధించిన కావాలని ఢిల్లీ టెలికాం విభాగం తమను డిమాండ్‌ చేసినట్లు టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌కు ఈ మెయిల్‌ రాశాయి. ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మకశ్మీర్‌లోని పలు లైసెన్స్‌ సర్వీస్‌ ఏరియా (ఎల్‌ఎస్‌ఏ) యూనిట్లు ప్రతి నెలా ఓ రోజుకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్త కాల్‌ డేటా రికార్డులను కోరుతున్నాయని తెలిపాయి. ఫోన్లపై నిఘా పెట్టారన్నా ఆరోపణలకు దారి తీసే విధంగా బల్క్‌ కాల్‌ డేటా సమాచారం కోరడం టెలీకాం శాఖ జారీ చేసిన ప్రామాణిక నిబంధనలకు విరుద్ధమని అందులో పేర్కొన్నాయి. అయితే తమ మొయిల్‌కు టెలికాం కార్యదర్శి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.  logo