శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 15:03:48

ఇక ఇండియాలోటెలీ మెడిసిన్‌ !

ఇక ఇండియాలోటెలీ మెడిసిన్‌ !

కరోనా నేపథ్యంలో పలు రంగాలలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే వైద్య రంగంలో కూడా. దేశంలో ఇప్పటివరకు అందుబాటులో లేని టెలీమెడిసిన్‌ను ప్రస్తుతం కొన్ని మార్గదర్శకాలతో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విషయమై మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ), నీతీ ఆయోగ్‌తో చర్చించి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.

రిజిస్టర్‌ చేసుకున్న వైద్యులు మాత్రమే టెలీమెడిసిన్‌ సేవలు అందించడానికి అర్హులు.  వీడియో, ఆడియో, ఫోన్‌ మెసేజ్‌ల ద్వారా సేవలు అందించవచ్చు. వీటితోపాటు మరికొన్ని నిబంధలను ఎంసీఐ పేర్కొంది.

అసలు టెలీమెడిసిన్‌ అంటే తెలుసుకుందాం… దూరంగా ఉన్న పేషంట్లకు ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా అంటే సెల్‌, లేదా ల్యాండ్‌ ఫోన్‌, వీడియోకాన్ఫరెన్స్‌ కాల్‌ తదితర సాధనాల ద్వారా చికిత్సను అందించడమే టెలీ మెడిసిన్‌. దీనిద్వారా తీవ్రమైన అంటువ్యాధులు వచ్చిన సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది కూడా వాటి నుంచి రక్షణ పొందవచ్చు. తక్కువ వైద్యసిబ్బందితో ఎక్కువ మందికి వైద్య సేవలు అందిచవచ్చు. పలు దేశాలలో టెలీ మెడిసిన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో వీటిని ఇప్పటి వరకు అనుమతించలేదు. ప్రస్తుతం కరోనాతో దేశమంతా లాక్‌డౌన్‌ కావడంతో అనేక మంది రోగులకు వైద్యం అందించడానికి ప్రస్తుతం దీన్ని అనుమతించారు. 


logo