తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి జీవన్ రక్షా అవార్డు

న్యూఢిల్లీ: ప్రజల ప్రాణాలను రక్షించడంలో ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డికి అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని సోమవారం సాయత్రం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. 40 మంది ప్రాణాలను రక్షించే ఆదర్శప్రాయమైన చర్యలకుగాను 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. జీవన్ రక్షా పదక్ అవార్డులను ఇవ్వడానికి ఆమోదం తెలిపారు.
జీవన్ రక్షా పదక్ సిరీస్ అవార్డులను సర్వోత్తం జీవన్ రక్షా పదక్, ఉత్తమ్ జీవన్ రక్షా పదక్, జీవన్ రక్షా పదక్ అనే మూడు విభాగాలలో ఇస్తారు. అధికారిక విడుదల ప్రకారం, కేరళకు చెందిన ముహమ్మద్ ముహ్సిన్ను మరణానంతరం సర్వోత్తం జీవన్ రక్షా పదక్‌తో సత్కరించనున్నారు. ఉత్తమ్ జీవన్ రక్షా పదక్ అవార్డును ఎనిమిది మందికి, జీవన్ రక్షా పదక్ అవార్డును 31 మందికి ప్రదానం చేస్తారు. ఉత్తమ్ జీవన్ రక్షా పదక్ కింద తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఇన్స్పెక్టర్ కోరిపల్లి సృజన్‌రెడ్డి ఉన్నట్లు హోం శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పురస్కారం కింద పతకం, కేంద్ర హోంమంత్రి సంతకం చేసిన సర్టిఫికేట్, ఏక మొత్తంలో నగదు, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత సమయంలో అవార్డు గ్రహీతకు అందజేస్తాయి. అన్ని వర్గాల వ్యక్తులు ఈ అవార్డులకు అర్హులుగా తీసుకుంటారు.
బావిలో నుంచి ఇద్దరిని కాపాడిన సృజన్‌రెడ్డి
కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలో ఉన్న మడిపల్లి గ్రామంలో ఉన్న ఓ బావిలో చెత్తచెదారాన్ని తీసేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆక్సిజన్ అందక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న సీఐ సృజన్‌రెడ్డి ఒక్క పరుగున మడిపల్లికి చేరుకుని మరో ఆలోచన చేయకుండా బావిలోకి దిగి మరిపెల్లి రాము, మల్లయ్యను బయటకు తీశారు. ఇన్స్పెక్టర్ ధైర్యసాహసాలను డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు. 2019 మే నెలలో ఇద్దరు కార్మికుల జీవితాలను కాపాడేందుకు పాడుబడిన బావిలోకి దిగిన సీఐ సృజన్‌రెడ్డి చర్య ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇదే ఆదర్శప్రాయమైన చర్య ఇప్పుడు దేశంలో అత్యున్నత పురస్కారం ఉత్తమ్ జీవన్ రక్షక్ పదక్ అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హీరోని చూసేందుకు నీళ్ళల్లోకి దూకిన అభిమాని
- విరాట్ కోహ్లి vs బెన్ స్టోక్స్.. నాలుగో టెస్ట్‌లో గొడవ.. వీడియో
- వావ్ పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. వీడియో
- జార్ఖండ్‌లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
- తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు
- గుడ్ న్యూస్ చెప్పిన శ్రేయా ఘోషాల్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- డ్యాన్స్‌తో అదరగొట్టిన జాన్వీ కపూర్.. వీడియో వైరల్
- ల్యాండ్ అయినట్లే అయి పేలిపోయిన స్టార్‌షిప్.. వీడియో
- ఏడాదిగా కూతురుపై తండ్రి లైంగిక దాడి