మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 16, 2020 , 12:05:39

నితీశ్ ప్ర‌మాణస్వీకారానికి తేజ‌స్వి డుమ్మా!

నితీశ్ ప్ర‌మాణస్వీకారానికి తేజ‌స్వి డుమ్మా!

ప‌ట్నా: బీహార్‌లో జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఈ సాయంత్రం ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం కోసం ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతోపాటు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకానున్నారు. అయితే ఆర్జేడీ కీల‌క నేత తేజ‌స్వియాద‌వ్ మాత్రం నితీశ్ ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రు కావ‌డంలేదని తెలిసింది. ఈ విష‌యాన్ని తేజ‌స్వియాద‌వ్ స్వ‌యంగా చెప్పార‌ని అతని స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.