బుధవారం 24 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 09:55:05

జార్ఖండ్ సీఎంను క‌ల‌వ‌నున్న తేజ‌స్వీ యాద‌వ్‌

జార్ఖండ్ సీఎంను క‌ల‌వ‌నున్న తేజ‌స్వీ యాద‌వ్‌

రాంచీ : బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం క్షీణించింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కుటుంబం శుక్ర‌వారం రాత్రి హుటాహుటిన రాంచీకి చేరుకున్నారు. ప్ర‌స్తుతం రాంచీలోని రిమ్స్‌లో లాలూకు వైద్యం కొన‌సాగుతోంది. లాలూ ఆరోగ్య ప‌రిస్థితిని వివ‌రించేందుకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ శ‌నివారం ఉద‌యం క‌ల‌వ‌నున్నారు. 

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు ఇప్ప‌టికే హార్ట్ స‌ర్జ‌రీ జ‌రిగింది. కిడ్నీ సమ‌స్య‌తో కూడా బాధ‌ప‌డుతున్నారు. న్యూమోనియా కూడా ఉంది. ప్ర‌స్తుతం శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డుతున్నారు అని తేజ‌స్వీ యాద‌వ్ పేర్కొన్నారు. లాలూ భార్య ర‌బ్రీదేవి, కూతురు మీసా భార‌తి, కుమారులు తేజ‌స్వీ యాద‌వ్‌, తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ రాంచీకి వ‌చ్చారు. పశుగ్రాసం కుంభకోణం ఆరోపణల్లో జైలు శిక్ష పడిన లాలూ ప్రసాద్‌, జార్ఖండ్‌లోని రాంచీ జైలులో ఉంటున్నారు. 


VIDEOS

logo