బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 11, 2020 , 17:57:29

తేజస్వి చాలా మంచి బాలుడు: ఉమా భారతి

తేజస్వి చాలా మంచి బాలుడు: ఉమా భారతి

పాట్నా: ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ చాలా మంచి బాలుడని బీజేపీ సీనియర్‌ నాయకురాలు ఉమా భారతి కొనియాడారు. ఆయన పెద్దైన తర్వాత రాష్ట్రాన్ని పాలించవచ్చంటూ సలహా ఇచ్చారు. బీహార్‌ అసెంబ్లీ, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ఉమా భారతి స్పందించారు. ‘తేజస్వి చాలా మంచి బాలుడు. అయితే ఆయన రాష్ట్రాన్ని పరిపాలించలేరు. ఆయన తండ్రి లాలు జోక్యం చేసుకుని బీహార్‌ను మళ్లీ జంగిల్‌ రాజ్‌గా మార్చేవారు. ఆ ముప్పు నుంచి బీహార్‌ సేవ్‌ అయ్యింది. పెద్దైన తర్వాత తేజస్వి రాష్ట్రాన్ని లీడ్‌ చేయవచ్చు’ అని ఆమె వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌పైనా ఉమా భారతి ప్రశంసలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో చాలా బాగా పోరాడని అన్నారు. ప్రభుత్వాన్ని కూడా ఆయన ఇదే విధంగా నడిపి ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావని తెలిపారు. కమల్‌ నాథ్‌ చాలా మంచి వ్యక్తి అని, తన సోదరుడు లాంటివారని ఉమా భారతి చెప్పారు. చాలా వ్యూహాత్మకంగా ఎన్నికల్లో పోరాడారంటూ ఆమె కితాబు ఇచ్చారు.

అయితే తేజస్వి యాదవ్‌, కమల్‌ నాథ్‌ను ఉమా భారతి నిజంగా ప్రశంసించారా లేక ఎన్నికల్లో వారు ఓడిపోవడంపై ఇలా పరోక్షంగా ఎద్దేవా చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.