గురువారం 01 అక్టోబర్ 2020
National - Jul 05, 2020 , 16:54:44

మైన‌ర్‌పై అత్యాచారం.. ఆపై భౌతిక దాడి

మైన‌ర్‌పై అత్యాచారం.. ఆపై భౌతిక దాడి

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఛ‌ర్త‌వాల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామంలో 14 ఏండ్ల బాలిక‌పై ఓ యువ‌కుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆపై త‌న ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి సామూహిక అత్యాచారానికి ప్ర‌య‌త్నించాడు. బాలిక తీవ్రంగా ప్ర‌తిఘ‌టించ‌డంతో న‌లుగురు క‌లిసి ఆమెను తీవ్రంగా కొట్టారు. ఈ ఘ‌ట‌న‌పై బాధితురాలి మేన‌మామ పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

బాలిక త‌న సోద‌రితో క‌లిసి ఇంట్లో నిద్రిస్తుండ‌గా నిందితులు ఆమె ఇంట్లోకి ప్ర‌వేశించి ఎత్తుకెళ్లార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితులు న‌లుగురు ప‌రారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  ‌


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo