శనివారం 04 జూలై 2020
National - Jun 23, 2020 , 17:55:43

గండక్‌ డ్యామ్‌ మరమ్మతు కోసం నేపాల్‌కు భారత్‌ బృందం

గండక్‌ డ్యామ్‌ మరమ్మతు కోసం నేపాల్‌కు భారత్‌ బృందం

పాట్నా: నేపాల్‌లోని గండక్‌ డ్యామ్‌ మరమ్మతు పనులకు భారత్‌, నేపాల్‌ మధ్య అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో బీహార్‌ సాగునీటి శాఖకు చెందిన అధికారుల బృందం మంగళవారం నేపాల్‌కు వెళ్లింది. తమ వెంట సుమారు 50 మంది కార్మికులను కూడా తీసుకు వెళ్లినట్లు బగహా ఎస్‌డిఎం విశాల్ రాజ్ తెలిపారు. అవసరమైతే మరింత మంది పనివారిని తీసుకెళ్లి యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడతామని ఆయన చెప్పారు.

గండక్‌ డ్యామ్ వద్ద సమస్య ఏర్పడంతో బీహార్‌ సరిహద్దు ప్రాంతాలను వరద నీరు ముంచెతుతున్నది. కాగా గండక్‌ డ్యామ్‌ మరమ్మతు పనులకు నేపాల్‌ అభ్యంతరం వ్యక్తం చేసిందని బీహార్‌ మంత్రి సంజయ్‌ ఝా ఇటీవల ఆరోపించారు. దీంతో ఎవరికీ చెందని ప్రాంతంలోని లాల్ బకేయ నదిపై ఉన్న ఈ డ్యామ్‌ మరమ్మతు పనులను తాము నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు. 
logo