సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 14:43:22

ప‌దిమందికి భ‌విష్య‌త్తునిచ్చే టీచ‌ర్‌కు.. ప‌కోడీలు అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి!

ప‌దిమందికి భ‌విష్య‌త్తునిచ్చే టీచ‌ర్‌కు.. ప‌కోడీలు అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి!

మొన్న‌టికి మొన్న సాఫ్ట‌వేర్ ఉద్యోగిణి ఉద్యోగం పోవ‌డంతో కూర‌గాయ‌లు అమ్ముకుంటున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా అంద‌రి జీవితాలు అలానే ఉన్నాయి. గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాల‌కు త‌ప్ప మిగ‌తా అన్ని ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉద్యోగంలోంచి తీసేస్తే ప‌రిస్థితి ఏంట‌ని వ‌ర్క్‌ఫ్రంహోమ్ చేసే వాళ్లంతా నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేస్తున్నారు. మ‌రి ఆ వీలుబాటు కూడా లేని ప్రైవేట్ టీచ‌ర్ల ప‌రిస్థితి ఆ దేవుడికి కూడా చెప్పుకోలేరు. స్కూల్, కాలేజీలు లేక‌, ఆన్‌లైన్ క్లాసులు జ‌ర‌క్క‌పోవ‌డంతో వారి బ్యాంక్ ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. ఈ క‌రోనా పోయేంత వ‌ర‌కు వీరు ఏదొక ప‌నిచేసుకొని పొట్ట నింపుకోవాల‌ని ఓ టీచ‌ర్ ఇదిగో ఇలా ప‌కోడీలు అమ్ముకుంటున్నారు.

ప‌దిమందికి పాఠాలు చెప్పి. వారికి భ‌విష్య‌త్తుపై అవ‌గాహ‌న క‌ల్పించే పంతులు భ‌విష్య‌త్తు ఇలా మార‌డం ఎంత అన్యాయం. కానీ త‌ప్ప‌దు. అంద‌రిదీ అలానే ఉంది. ద‌క్షిణ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్రైమ‌రీ స్కూల్‌లో కాంట్రాక్టు టీచ‌ర్‌గా ప‌నిచేసిన అబ్దుల్ క‌దీర్ మే 10 నుంచి ఖాళీగా ఉంటున్నారు. రోజులు గ‌డుస్తున్న ప‌రిస్థితులు మార‌డం లేదు. జీతాలు లేక‌పోవ‌డంతో కుటుంబాన్ని పోషించ‌డం క‌ష్టంగా మారింది. ఆయ‌న‌కు వేరే మార్గం లేక‌పోవ‌డంతో ప‌కోడీలు అమ్ముకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పే బ‌డి పంతుల‌కు ఇలాంటి ప‌రిస్థితి రావ‌డం బాధాక‌రం. 


logo