శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 10:42:52

13 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుల అత్యాచారం

13 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుల అత్యాచారం

జైపూర్‌ : బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే అత్యంత నీచమైన ఘటనకు ఒడిగట్టారు. 13ఏళ్ల విద్యార్థినిపై పాఠశాల ఉపాధ్యాయులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డ దారుణమైన ఘటన రాజస్థాన్‌ ఆల్వార్‌ జిల్లాలోని నారాయణ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పాఠశాల మేనేజర్‌తో పాటు ఉపాధ్యాయులు, పలువురు సిబ్బంది సైతం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తం 13 మందిపై నారాయణ్‌పూర్‌ పోలీసులు పోక్సో, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఏడాది కాలంగా బాలికపై అత్యాచారానికి పాల్పపడుతున్నారని, ఈ విషయం ఎవరికైన చెబితే చంపుతామని బాలికలను బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులకు సహకరించిన ముగ్గురు మహిళా సిబ్బందిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo