శనివారం 04 జూలై 2020
National - Jun 24, 2020 , 03:27:34

వైమానిక దళ అధికారిణిగా చాయ్‌వాలా కూతురు

వైమానిక దళ అధికారిణిగా చాయ్‌వాలా కూతురు

  • లక్ష్య సాధనకు పేదరికం 
  • అడ్డుకాదని నిరూపించిన అంచల్

భోపాల్‌, జూన్‌ 23: కష్టపడితే ఏదైనా సాధించొచ్చని, పేదరికం అడ్డురాదని నిరూపించారు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి. తండ్రి చాయ్‌ అమ్మి కుటుంబాన్ని పోషిస్తూ.. కొన్ని సందర్భాల్లో చదువుకు ఫీజు కట్టలేని పరిస్థితులు ఎదురైనా ధైర్యం కోల్పోని ఆమె కష్టపడి భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)లో చేరాలన్న తన లక్ష్యాన్ని సాధించారు. మధ్యప్రదేశ్‌లోని మూనిచ్‌ జిల్లాకు చెందిన సురేశ్‌ గాంగ్వాల్‌ ఓ బస్టాండ్‌ వద్ద చాయ్‌ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కూతురు అంచల్‌. 2013లో ఉత్తరాఖండ్‌లోని కేథార్‌నాథ్‌లో వరదలు సంభవించినప్పుడు వైమానిక దళానికి చెందిన బలగాలు చేపట్టిన సహాయక చర్యలను చూసి అంచల్‌ స్ఫూర్తిపొందారు. తాను కూడా వైమానిక దళంలో చేరాలని ఆమె నిర్ణయించుకున్నారు. పలుసార్లు ప్రయత్నించి విఫలమైనప్పటికీ వెనుకడుగు వేయలేదు. చివరికి ఆరో ప్రయత్నంలో విజయం సాధించి ఐఏఎఫ్‌లో ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా చేరారు.


logo