బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 17:51:48

పన్ను చెల్లింపుదారులకు ఊరట

పన్ను చెల్లింపుదారులకు ఊరట

ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ దేశంలోని మధ్యతరగతి ప్రజానికానికి ఊరట కల్పించారు. ఆత్మ నిర్భర భారత్‌ అభియాన్‌ ప్యాకేజీ వివరాలను మంత్రి మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించారు. ప్రస్తుతం ఉన్న టీడీఎస్‌(ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌), టీసీఎస్‌(ట్యాక్స్‌ కలక్షన్‌ ఎట్‌ సోర్స్‌) ను 25 శాతం మేర తగ్గించారు. ఒప్పంద, వృత్తిగత ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్‌, కమీషన్‌, బ్రోకరేజ్‌ మొదలైనవి ఈ తగ్గిన రేటుకు అర్హులు. ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఆర్థిక సంవత్సరం 31, మార్చి 2021 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. 25 శాతం తగ్గింపుతో ప్రజలకు రూ. 50 వేల కోట్ల మేర లబ్ది చేకూరి నగదు లభ్యతకు ఆస్కారం ఉంటుందన్నారు. 


logo