గురువారం 09 జూలై 2020
National - Jun 15, 2020 , 20:05:45

విశాఖలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

విశాఖలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

ఆంధ్రప్రదేశ్‌ : విశాఖ నగరంలో టీడీపీ, వైసీపీ శ్రేణల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలివి.. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సోమవారం ఓ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల నడుమ ఘర్షణ జరిగింది. వైసీపీ శ్రేణులు తనను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి అక్కడే నిరసనకు దిగారు. వైసీపీ మద్దతుదారులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ద్వారకా జోన్‌ ఏసీపీ ఆర్వీఎస్‌ మూర్తి ఇరుపార్టీల మద్దతుదారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపారు. ఘర్షణలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. వైసీపీ శ్రేణులు కార్యక్రమాన్ని అడ్డుకోవడం వల్లే ఘర్షణ జరిగిందని, టీడీపీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.


logo