శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 23:07:56

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల జీతం విరాళం..

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల జీతం విరాళం..

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో తమ వంతుగా ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం రూ. 10 లక్షలు విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాన్ని అందజేస్తున్నట్లు వారు తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించేందుకు తెలుగు రాష్ర్టాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 


logo