శనివారం 16 జనవరి 2021
National - Dec 29, 2020 , 11:20:30

కడప ప్రొద్దుటూర్‌లో టీడీపీ నేత హత్య

కడప ప్రొద్దుటూర్‌లో టీడీపీ నేత హత్య

అమరావతి : కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. సోమలవారిపల్లెలో ఖాళీ స్థలంలో సుబ్బయ్యను గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ కారణాలతోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.