బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 12:51:32

టీడీపీ నాయకుడు బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం

టీడీపీ నాయకుడు బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం

కర్నూల్‌ : తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, కర్నూల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ బంగి అనంతయ్య బుధవారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశారు. బుధవారపేటలోని తన ఇంట్లోనే అనంతయ్య ఉరేసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతయ్యను వైద్యులు ప్రాణాలతో కాపాడారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఆయా పార్టీల నాయకులు కలిసి అనంతయ్యను పరామర్శించారు. అనంతయ్యను పార్టీలో కొంతమంది అవమానిస్తున్నారని, ఆర్థిక సమస్యలు కూడా అధికమైనందున ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 


logo