మంగళవారం 26 మే 2020
National - May 21, 2020 , 00:53:54

ట్రూనాట్‌ మెషీన్లతో కరోనా నిర్ధారణ

ట్రూనాట్‌ మెషీన్లతో కరోనా నిర్ధారణ

  • ఐసీఎంఆర్‌ సవరణ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: టీబీ పరీక్షలకు ఉపయోగించే ట్రూనాట్‌ యంత్రాలను ఇకపై కొవిడ్‌-19 స్క్రీనింగ్‌తోపాటు వ్యాధి నిర్ధారణకు కూడా ఉపయోగించవచ్చని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)’ తెలిపింది. ట్రూనాట్‌ సిస్టమ్‌ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్‌ ఏప్రిల్‌ 10నే అనుమతి ఇచ్చింది. తాజాగా వీటితో వ్యాధి నిర్ధారణ కూడా చేయొచ్చని సవరణ మార్గదర్శకాలను జారీచేసింది. కరోనా నిర్ధారణకు మళ్లీ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది. మృతదేహాలపై కరోనా వైరస్‌ మనుగడ సమయంతోపాటు తగ్గిపోతుందని, అయితే మృతదేహం పూర్తిగా కరోనా రహితంగా మారడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేమని ఐసీఎంఆర్‌ తెలిపింది. 


logo