శనివారం 06 జూన్ 2020
National - May 18, 2020 , 10:34:32

నిబంధ‌న‌ల‌‌తో ట్యాక్సీలు, ఆటోల‌కు అనుమ‌తి..

 నిబంధ‌న‌ల‌‌తో ట్యాక్సీలు, ఆటోల‌కు అనుమ‌తి..


హైద‌రాబాద్‌: పంజాబ్ రాష్ట్రం లాక్‌డౌన్ 4.0కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసింది.  క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ చ‌ర్య‌లు పాటిస్తూనే .. ప్ర‌జ‌ల‌కు కొన్ని వెస‌లుబాట్లు క‌ల్పించింది. పంజాబ్‌లో షాపుల‌ను ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు తెర‌వ‌నున్నారు.  కొన్ని నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ట్యాక్సీలు, ఆటోల‌కు అనుమ‌తి ఇస్తున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా తిరిగే ప్రైవేటు వాహ‌నాల‌కు ఎటువంటి పాస్‌లు అవ‌స‌రం లేదు. ప్ర‌యాణికులు వారి వారి ఐడెంటీ కార్డులు తీసుకువెళ్తే బెట‌ర్‌.  విద్యాసంస్థ‌ల ఆఫీసు వ‌ర్క్‌, ఆన్‌లైన్ బోధ‌న కోసం అవ‌కాశం క‌ల్పించారు. కొరియ‌ర్‌, పోస్ట‌ల్ స‌ర్వీసుల‌కు కూడా ఓకే చెప్పేశారు. logo